అర్చిరాది

ఏదో ఒకనాటికి దేహం పండువలే రాలిపోక తప్పదు. ముసలితనమున సుఖించుటకై వయస్సున్నప్పుడే ధనమును దాచుకొను బుద్ధిమంతునివలే,శరీరము రాలిపోవులోపలే జీవుడు కొంత తెలుకుకోవాలి. ఏమది? దేహము తొలగిన తరువాత తను పయనించెడి మార్గమును తలచుట, ఆ తలంపు దృఢముగా ఉదయము రాత్రి సాగించగలిగినచో చివరి సమయములో దుఃఖములుండని శాశ్వత సుఖస్థానము లభిస్తుందని వేదాన్తం బోధిస్తుంది. అది ఇట్లు...

1    Click to Play the sloka       
సత్సంగా ద్భవనిస్పృహో గురుముఖాత్ శ్రీశం ప్రపద్యా త్మవాన్
ప్రారబ్ధం పరిభుజ్య కర్మశకలం ప్రక్షీణ కర్మాన్తరః
న్యాసాదేవ నిరంకుశేశ్వర దయా నిర్లూనమాయాన్వయః
హార్దానుగ్రహ లబ్ధ మధ్య ధమని ద్వారా ద్బహి ర్నిర్గతః
2    Click to Play the sloka       
ముక్తో೭ర్చి ర్దిన పూర్వపక్ష షడుదఙ్ మాసా బ్ద వాతాంశుమత్
గ్లౌ విద్యు ద్వరుణేంద్ర ధాతృమహితః సీమాంత సింధ్వాప్లుతః
శ్రీ వైకుంఠ ముపేత్య నిత్య మజడం, తస్మిన్ పరబ్రహ్మణః
సాయుజ్యం సమవాప్య నందతి సమం తేనైవ ధన్యః పుమాన్
3    Click to Play the sloka       
ప్రాత ర్నిత్యానుసంధేయం పరమార్థం ముముక్షుభిః
శ్లోకద్వయేన సంక్షిప్తం సువ్యక్తం వరదో బ్రవీత్