మౌక్తికములు

రామానుజా అనే అక్షరములు చాలు పాపాల్ని పటాపంచలు చేసి పరమపదాన్ని ప్రసాదిస్తాయి. నాలుగక్షరముల సరళమైన మంత్రమిది. జననమరణ చక్రమునుండి విడిపిస్తుందీ మంత్రము. అయోగ్యులమైన మనవంటి ప్రాణులు ఈ రామానుజమంత్రమ లేకపోతే తరించడమే దుర్లభము. మనకామంత్రమే తరణోపాయము. మరొకటేదియు ఉజ్జీవింపచేసేదికాదు.

1          
కాషాయ శోభి కమనీయ శిఖానివేశం
దండ త్రయోజ్జ్వలకరం విమలోపవీతం
ఉద్యశ ద్దినేషనిభ ముల్లస దూర్ధ్వ పుండ్రం
రూపం తవాస్తు యతిరాజ దృశో ర్మమాగ్రే
2          
ఏతానితాని భువన త్రయపావనాని
సంసారరోగ శకలీ కర ణౌషధాని
జిహ్వాతలే మమ లిఖాని యథా శిలాయాం
రామానుజేతి చతురాణ్య మృతాక్షరాణి
3          
నమః ప్రణవ శోభితం నవకషాయ ఖండాంబరం
త్రిదండ పరిమండితం త్రివిధ తత్త్వ నిర్వాహకమ్
దయాఞ్చిత దృగఞ్చలం దళితవాది వాగ్వైభవం
క్షమాది గుణసాగరం శరణమేమి రామానుజమ్
4          
న చేద్రామానుజుజేత్యేషా చతురా చతురక్షరీ
కామవస్థాం ప్రపద్యన్తే జన్తవో హన్త మాదృశః
5          
పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాన్త క్షయాయ చ
శ్రీమా నావిరభూత్ భూమౌ రామానుజ దివాకరః
తృణీకృత విరించాది నిరంకుశ విభూతయః
రామానుజ పదాంభోజ సమాశ్రయణ శాలినః
6          
సత్యం సత్యం పున స్సత్యం యతిరాజో జగద్గురుః
స ఏవ సర్వలోకానా ముద్ధర్తా నాస్తి సంశయః
7          
అపగత మదమానైః అన్తిమోపాయనిష్ఠైః
అధిగతపరమార్ధైః అర్థకామానపేక్షైః
నిఖిలజన సుహృద్భిః నిర్జితక్రోధలోభైః
వరవరముని భృత్యైః అస్తు మే నిత్యయోగః