పంచాయుధ స్తోత్రము

భక్తులకు ఆభరణములై, భక్తుని ప్రేమను పెంచుచు దుష్టులకు ఆయుధములై భయమును రేకెత్తించు శంఖ, చక్ర గదా, ఖడ్గ, శార్ఙ్గములను దివ్యనామములు గల శ్రీహరి ధరించు ఈ పంచాయుధములను గూర్చిన స్తోత్రమును ప్రభాత సమయమున అనుసంధించు వారి యొక్క పాపములన్నియు నశించును. భయములన్నియు వెంటనే తొలగును. దుఃఖములు అట్టివారి దరిచేరవు. సమస్త సుఖములను అనుభవింతురు .

1    Click to Play the sloka       
స్ఫురత్ సహస్రార శిఖా తితీవ్రం
సుదర్శనం భాస్కర కోటి తుల్యమ్
సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః
చక్రం సదాహం శరణం ప్రపద్యే
2    Click to Play the sloka       
విష్ణో ర్ముఖోత్థా నిల పూరితస్య
యస్య ధ్వని ర్దానవ దర్ప హంతా
తం పాంచజన్యం శశికోటి శుభ్రం
శంఖం సదాహం శరణం ప్రపద్యే
3    Click to Play the sloka       
హిరణ్మయీం మేరు సమానసారాం
కౌమోదకీం దైత్య కులైక హంత్రీమ్
వైకుంఠ వామాగ్ర కరాభి మృష్టాం
గదాం సదాహం శరణం ప్రపద్యే
4    Click to Play the sloka       
రక్షో೭సురాణాం కఠినోగ్ర కంఠ
చ్ఛేదక్షర చ్ఛోణిత దిగ్ధధారమ్
తం నందకం నామ హరేః ప్రదీప్తం
ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే
5    Click to Play the sloka       
య జ్జ్యానినాద శ్రవణా త్సురాణాం
చేతాంసి నిర్ముక్త భయాని సద్యః
భవంతి దైత్యాశని బాణవర్షి
శార్ఙ్గం సదాహం శరణం ప్రపద్యే
6    Click to Play the sloka       
ఇమం హరేః పంచ మహాయుధానాం
స్తవం పఠేత్ యో೭నుదినం ప్రభాతే
సమస్త దుఃఖాని భయాని సద్యః
పాపాని నశ్యంతి సుఖాని సంతి
7    Click to Play the sloka       
వనే రణే శత్రు జలాగ్ని మధ్యే
యదృచ్ఛయాపత్సు మహాభయేషు
ఇదం పఠన్ స్తోత్ర మనాకులాత్మా
సుఖీ భవేత్ తత్కృత సర్వ రక్షః
8    Click to Play the sloka       
స శంఖ చక్రం సగదాసి శార్ఙ్గం
పీతాంబరం కౌస్తుభ వత్స చిహ్నమ్
శ్రియా సమేతోజ్జ్వల శోభితాంగం
విష్ణుం సదాహం శరణం ప్రపద్యే
9    Click to Play the sloka       
జలే రక్షతు వారాహః స్ధలే రక్షతు వామనః
అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవ