పరత్వాది పంచకము

ప్రతిదినము ఉదయాన శ్రీ వరదగురువులు అనుగ్రహించిన శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమును తెలుపు -పరత్వాది పంచక-మను ఈ ఉత్తమమైన స్తోత్రమును ఎవరు అనుసంధింతురో వారికి నిష్కల్మషమైన భక్తి సిద్ధించును. శ్రీశుని యందు అవిచ్ఛిన్న ప్రేమ లభించును.

1    Click to Play the sloka       
ఉద్య ద్భానుసహస్ర భాస్వర పరవ్యోమాస్పదం నిర్మల
జ్ఞానానంద ఘన స్వరూప మమల జ్ఞానాదిభి ష్షడ్గుణైః
జుష్టం, సూరిజనాధిపం, ధృత రథాగాబ్జాది భూషోజ్జ్వలం
శ్రీ భూ సేవ్య మనంతభోగి నిలయం శ్రీ వాసుదేవం భజే
2    Click to Play the sloka       
ఆమోదే భువనే ప్రమోద ఉత సమ్మోదే చ సంకర్షణం
ప్రద్యుమ్నం చ తథా೭నిరుద్ధమపి తాన్ సంహార సృష్టిస్థితీః
కుర్వాణా న్మతి ముఖ్య షడ్గుణవరై ర్యుక్తాన్ త్రియుగ్మాత్మకైః
వ్యూహాదిష్ఠిత వాసుదేవ మపి తం క్షీరాబ్ధినాథం భజే
3    Click to Play the sloka       
వేదాన్వేషణ, మందరాద్రి భరణ, క్ష్మోద్ధారణ, ప్రశ్రిత
ప్రహ్మాదావన, భూమిభిక్షణ, జగద్విక్రాంతయో యత్ర్కియాః
దుష్టక్షత్ర నిబర్హణం, దశముఖాద్యున్మూలనం, కర్షణం
కాళింద్యా, అతిపాప కంస నిధనం యత్ర్కీడితం తం నుమః
4    Click to Play the sloka       
యో దేవాది చతుర్విధేషు జనిషు బ్రహ్మాండ కోశాంతరే
సంభక్తేషు చరాచరేషు చ విశన్ ఆస్తే సదా న్తర్బహిః
విష్ణు స్తం నిఖిలే ష్వణు ష్వణుతరం భూయస్సు భూయస్తరం
స్వాంగుష్ఠ ప్రమితం చ యోగిహృదయే ష్వాసీన మీశం భజే
5    Click to Play the sloka       
శ్రీ రంగశ్థల వేంకటాద్రి కరిగిర్యాదౌ శతే೭ష్టోత్తరే
స్థానే గ్రామ నికేతనేషు చ సదా సాన్నిధ్య మాసేదుషే
అర్చారూపిణ మర్చకాభిమతిత స్స్వీకుర్వతే విగ్రహం
పూజాం చాఖిలవాంఛితా న్వితరతే శ్రీ శాయ తస్మైనమః
6    Click to Play the sloka       
ప్రాత ర్విష్ణోః పరత్వాది పంచకస్తుతి ముత్తమామ్
పఠన్ ప్రాప్నోతి భగవద్భక్తిం వరదనిర్మితాం