పంచాయుధ స్తోత్రము
భక్తులకు ఆభరణములై, భక్తుని ప్రేమను పెంచుచు దుష్టులకు ఆయుధములై భయమును రేకెత్తించు శంఖ, చక్ర గదా, ఖడ్గ, శార్ఙ్గములను దివ్యనామములు గల శ్రీహరి ధరించు ఈ పంచాయుధములను గూర్చిన స్తోత్రమును ప్రభాత సమయమున అనుసంధించు వారి యొక్క పాపములన్నియు నశించును. భయములన్నియు వెంటనే తొలగును. దుఃఖములు అట్టివారి దరిచేరవు. సమస్త సుఖములను అనుభవింతురు
.