ధాటీపఞ్చకమ్
గ్రంధకర్త: దాశరథి/ముదలియాండాన్
భగవద్రామానుజుల శిష్యులు ముదలియాండన్. వీరిపేరు దాశరథి. వీరందించిన స్తోత్రమే ధాటీపంచకము. ధాటీ అంటే దాడి. శ్రీభాష్యకారులు వేదబాహ్యమతాలపై దాడిచేశారు. అంటే వేదప్రతిష్ఠాపనాచార్యులుగా వైదికసిద్ధాన్తాన్ని, శ్రీమన్నారాయణ పరత్వాన్ని స్థిరంగా స్థాపించారు. ఆ భావాన్ని, యతిరాజ వైభవాన్ని ఐదుశ్లోకాలలో చెప్పడం వలన ఇది ధాటీపంచకము అని ప్రసిద్ధిని పొందింది.