కృష్ణాష్టకము
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి
అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో
సర్వజగత్కారణుడైన శ్రీమన్నారాయణుడు పరాత్పరుడై ఉండి కూడా ప్రేమకలవారేమి కోరితే దానినెంత కష్టమైనా చేసి తీరుతాననే తన ఆశ్రిత పరతంత్రతను, సౌలభ్యాన్ని ప్రకటిస్తూ దేవకీదేవి గర్భాన పుట్టాడు. అతడి పుట్టుకను స్మరించండి. కర్మ వల్ల కలిగే మన పుట్టుక ఆగిపోతుంది. అతని బంధం తలిస్తే మన కర్మబంధం తెగిపోతుంది. ఇది నిశ్చయం.