యతిరాజవింశతిః
గ్రంధకర్త: శ్రీమణవాళమామునులు/వరవరమునులు
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి దివ్యవాణితో
భగవద్రామానుజుల వైభవమును ప్రస్తుతించు స్తోత్రములలో యతిరాజవింశతి ప్రధానమైనది. యతిరాజులైన రామానుజులను ప్రసన్నులను చేసి, తమ నాశ్రయించిన వారిలోని భగవంతుని స్మరణకు, సేవకు ఆటంకాలైన దోషాలను శీఘ్రముగా పోగట్టి అనుగ్రహించేలా చేసే స్తోత్రమిది. అందరం కలసి స్తోత్రం చేద్దాం.