మౌక్తికములు
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి
అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో
రామానుజా! అనే అక్షరములు చాలు పాపాల్ని పటాపంచలు చేసి పరమపదాన్ని ప్రసాదిస్తాయి. నాలుగక్షరముల సరళమైన మంత్రమిది. జననమరణ చక్రము నుండి విడిపిస్తుందీ మంత్రము. అయోగ్యులమైన మనవంటి ప్రాణులు ఈ రామానుజమంత్రము లేకపోతే తరించడమే దుర్లభము. మనకామంత్రమే తరణోపాయము. మరొకటేదియు ఉజ్జీవింపచేసేది కాదు.